![]() |
![]() |

గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు అంటే ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. ప్రస్తుతానికి ఈ సీరియల్ అలాగే దీపక్ నటిస్తున్న పొదరిల్లు సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అందులో ముఖ్యంగా బాలు అంటే శ్రీముఖికి కూడా చాల ఇష్టం. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలోకి బాలు వచ్చాడంటే చాలు శ్రీముఖి తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అలాంటి బాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టు టాక్ నడుస్తోంది. నెటిజన్స్ కూడా ఇదే విషయాన్నీ చెప్తున్నారు. ఐతే బాలు తన సీరియల్ గురించి రీసెంట్ గ ఒక రీల్ ని రిలీజ్ చేసాడు.
"మీ అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ చాలా థాంక్స్ . గుండె నిండా గుడి గంటలు సీరియల్ చూసి మీ మనసు ఎంత నిండిపోయిందో తెలుసు. ఈ సీరియల్ ని చూడడమే కాదు వాళ్ళ ఫామిలీ మెంబర్స్ చూస్తున్న వీడియోస్ వల్ల నా మనసు అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా చాలా నిండిపోయింది. ఇప్పుడే తెలుస్తోంది మీరు మా సీరియల్ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అని ఇలాగే మీ ప్రేమను సపోర్ట్ ని నాకు నా సీరియల్ కి అందించండి. " అంటూ బాలు తన ఫాన్స్ కి చెప్పాడు.
ఐతే నెటిజన్స్ అంతా కూడా బాలు మీద యుద్దానికి దిగారు. పక్క కామెంట్స్ లో "కానీ మీరు సీరియల్ లో ఉండకుండా బిగ్ బాస్ లో వెళ్తున్నారంట కదా అలా వెళ్తే మేము అసలు సీరియల్ ఏ చూడము అన్న .. బీపీ డౌన్ అయ్యి పోయేలా ఉన్నాం బాలు చెప్పండీ బాలు ప్లీజ్...అన్న ఒక్కటి చెప్పాలంటే గుండెనిండా గుడిగంటలు సీరియల్ కి మెయిన్ మీరే అన్న. అలాంటి మీరు వెళ్తే మాత్రం సీరియల్ ఎవరు చూడరు అన్న ఇది ప్రామిస్ అన్న ... బాలు మీరు లేకపోతే సీరియల్ లెదు ఇది నిజం" అంటున్నారు . దానికి రిప్లైస్ గా "బిగ్ బాస్ కి వెళ్లినా మళ్ళీ వచ్చి సీరియల్ చేస్తారు అని బిగ్ బాస్ కి వెళ్తే సపోర్ట్ చేద్దాం అని కొంతమంది కొంతమందేమో బిగ్ బాస్ ఎందుకు అని బిగ్ బాస్ కి వెళ్ళండి " అంటున్నారు.
![]() |
![]() |